ఉషోదయాన పావురము పూలకొమ్మని ముక్కునకరచుకొని మద్యలో జారవిదిచినట్లు
ఏదో ఊహ ముప్పయ్యేళ్ళ క్రితము నటి ముసురులోకి విసిరివేసింది
మున్డుకు లాక్కేల్లుతున్నముసలితనాన్ని విదిలించి
ముప్పయ్యేళ్ళ క్రితము నాటి గతములోకి పరకాయప్రవేశము చేశాను.
దుమ్మువిదిలించుకున్న అనుభవాలు తలడువ్వుకున్నాయి
లేతెండలో వజ్రాల దూలిల చినుకులు మిను మినుకుమంటున్నాయి
తృప్తిగా వదిలిన గాలి రంగుల్ని పులుముకుని రింగులుగా తిరిగింది
పచని చెట్లన్నీ ప్రత్యక్ష సాక్షులుగా వున్నాయి
నడిచెంతదూరము నాతో మాటలడుతూనేఉన్నయి
కాళ్ళక్రింద పచ్చిక కమ్మగా పలకరిష్తూనే ఉన్నది
గతము నాతో నడిచింది గతము నాలో నడిచింది గతతరంగాలు నాకన్నా ముందుగానే వెళ్ళాయి
ఒకటే ఆలోచన గతాన్ని చూడాలి
ఒకటే ఆలోచన గతంతో మాట్లాడాలి
ఒకటే ఆలోచన గతం నాకు జవాబు ఇవ్వాలి
గతమంతా ప్రేమమయంగా జ్వలించిన రోజులు
సాహసమే శ్వాసగా సాగిన రోజులు
వాడి చూపుల్లో వేడి కన్నీళ్లు కదిలిన రోజులు
కలలమదిల్లో కరిగిపొఇన రోజులు
గతం నన్ను ప్రేమించలేదు నాకు బదులివ్వలేదు
బాద పడక తప్పదు భాద నుంచి బయటపడకా తప్పదు
బతుకులో వెతుకులాట తప్పదు
నిరశాకులోనయితే మల్లి గతాన్ని ప్రేమించలేము
గాయపడ్డ గమనాన్ని అపెయ్యలేము
ఏదో కావాలి ఎవరో రావాలి అంతులేని అన్వేషణ అజన్మాన్తము కొనసాగాలి
గతాన్ని ఆరాదిస్తునేవున్నవందనాలు చేస్తునేవున్న
గతము సద నన్ను ఒదారుస్థునెఉన్నది
వయసుమీదపడుతున్నగతస్పందన బతికే ఉంది
ఎన్నో కవితలు రాశాను ఖనడాన్తరాల్లో చల్లాను
గుండె స్పందిస్తూనే వుంది చూపులు గలిష్టునే ఉన్నాయి
ఏదో మ్రుడుస్వరము ఎప్పుడో వినిపిస్తుందని
ఏదో మ్రుదుహస్తం ప్రేమగా స్పర్షిస్తుంది అని ఎదురుచూస్తూనే ఉన్న
ఆనాడు నన్ను ప్రేమిచని నా గతానికి అవనత శిరస్సుతో నమస్కరిష్టున్నా
నన్ను నిరంతర అడుర్ష్ట యత్రికున్ని చేసినందుకు ఎంతో రునపడి ఉన్నానని
కన్నుముసేదాకా సున్నితంగా నే ఉంటాను
కనిపించిన అందరిని ప్రేమిస్తూనే ఉంటాను ద్వేశించను ..................
No comments:
Post a Comment