Friday, May 11, 2012

తెల్లారగట్ల 
మరికొన్ని నిముషాల్లో 
ప్రపంచము మారిపోతుంది .
నిశ్శబ్దము 
బహుశబ్దాలుగా విచ్చుకు పోతుంది.
ఎవరు ఉతుకుతున్నారో తెలియదు గాని 
చీకటి క్రమంగా వెలిసిపోతుంది.
ఏదో రంది 
గ్రందిల తగులుతుంటుంది.
చలి బయటినున్చిపెడుతున్దో 
దేహములోంచి వస్తుందో
చెప్పడం కష్టం
వనుకుమాత్రము మనసులోంచే.
ఇన్నివేల గురకలు
ఇన్నిరకాల కలవరింతలు
కళల పడవల మీదెక్కి
కదులుతున్న కళేబరాలు
నిద్రాదేవి వలలో చిక్కి
స్థానువయి పాయిన చరాచరలోకము...

ఇప్పుడు లోకము నేనే
మిగిలిపొయినటుల స్పురణ
కాలాన్ని తవ్వి తవ్వి
గడియారము డీలా పడిపోయింది .
రకరకాల రంగుల కలయికలు
కొత్త వరుసలను సృష్టిస్తాయి
విస్పరిత నేత్రాలు
విలక్షణ కావ్యాలవుతాయి.
నీల్లుకుమ్మరించిన కుండలా
మనసు తేలికవుతుంది .
యావత్ ప్రాణి కోటిని ప్రేమించాలనిపిస్తుంది .
వచ్చేడివాడు ఎవడో
వాడు బతుకుని వెలిగిస్తాడు

No comments:

Post a Comment